మాస్కోలో పెరుగుతున్న మహమ్మారి కేసులు

రష్యాలో  ఒక్కసారిగా అదుపుతప్పిన పరిస్థితి

coronavirus -russia
coronavirus -russia

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. గత రెండు రోజుల్లో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అక్కడ నమోదైన 10,328 కేసులో నమోదు కాగా, అందులో సగానికిపైగా కేసులు అంటే 5,596 రాజధాని మాస్కోలోనే నమోదు కావడం గమనార్హం. ఇక తాజా కేసులను కూడా కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 47,121కి పెరగ్గా, 405 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల్లోనూ సగం మాస్కోలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు 26,350 కేసులు నమోదయ్యాయి. 204 మంది మరణించారు. తాజా పరిస్థితులు చూస్తుంటే మాస్కో మరో న్యూయార్క్‌లా మారే అవకాశం ఉందని భయపడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/