వర్మ కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన మంచు మనోజ్

రామ్ గోపాల్ వర్మ అందరిపై పంచులు వేస్తుంటుంటారు..అలాంటి వర్మ కు మంచు మనోజ్ పంచ్ విసిరారు. గత కొద్దీ రోజులుగా మా లో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మా ఎన్నికలు ముగిసి , ఫలితాలు వచ్చినప్పటికీ ఏదో ఒక వ్యవహారం బయటకు వస్తూ మీడియా లో హైలైట్ అవుతుంది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ ..మా వ్యవహారం ఫై ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు.
మొత్తం జోకర్లతో సిని’మా’ సర్కస్ నిండిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు సోదరుడు, హీరో మంచు మనోజ్ స్పందించాడు. ‘మీరు అందులో రింగ్ మాస్టర్ సర్’ అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో ‘సరైన పంచ్ ఇచ్చావ్.. అన్నా..’ అంటూ మంచు మనోజ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021