ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసుల నుండి నోటీసులు

rajasingh
rajasingh

బిజెపి మ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల నుండి నోటీసులు రావడం మాత్రం ఆగడం లేదు. గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసారంటూ ఆయనపై ఏకంగా పిడియాక్ట్ కేసు నమోదు కావడం జైల్లో కొన్ని రోజులపాటు ఉండి, బెయిల్ ఫై బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా మరోసారి ఆయనకు పోలీసుల నుండి నోటీసులు అందాయి. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో రాజాసింగ్‌ మీద కేసు నమోదైంది.

కాగా.. ఈ కేసును ఇప్పుడు కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ క్రమంలోనే మంగళ్‌హాట్ పోలీసులు తాజాగా రాజాసింగ్‌కు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తరఫు న్యాయవాది కరుణ సాగర్ స్పందించారు. రాజాసింగ్‌కు పోలీసులు ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇస్తామన్నారు. ఎప్పుడో ఆగస్టు 2022లో నమోదైన కేసు గురించి ఇప్పుడు నోటీసులు ఇవ్వటమేంటని.. ఇన్ని రోజులు ఎందుకు ఉరుకున్నట్టని ప్రశ్నించారు.