ఏపిలో తీవ్రరూపం దాల్చిన కరోనా

ఒక్కరోజులో 81 కొత్త కేసులు నమోదు

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. గడచిన 24 గంటలలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1097కు చేరింది. కాగా కొత్తగాల నమోదు అయిన కేసులలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 4, గుంటూరులో 3, కడపలో 3, అనంతపురంలో 2, తూ.గో జిల్లాలో 2, ప్రకాశం లో 3, ప,గో జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా గుంటూరులొ 214 కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది మృతి చెందగా.. 231 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 835 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/