పాయల్ ‘మంగళవారం’ ఫస్ట్ లుక్ రిలీజ్

Rx100 ఫేమ్ పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం మంగ‌ళ‌వారం. ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. RX100 తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన పాయల్…మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఘటన లిప్ లాక్ లు , భారీ అందాల ఆరబోత తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత అమ్మడికి పలు ఛాన్సులు వచ్చినప్పటికీ అవేవి కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. దీంతో ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. కాకపోతే సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంటుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం మంగళవారం అనే మూవీ లో నటిస్తుంది. హారర్ టచ్ ఉన్న జోనర్లో ఈ కథ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. స్వాతి – సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈరోజు మంగళవారం కావడం తో ఈ సినిమా తాలూకా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ ను ఆయన సీతాకోకచిలుక మాదిరిగా చూపించారు.