వంగవీటి రాధా పార్టీ మార్పుపై ఆయన అభిమానులు క్లారిటీ

వంగవీటి రాధా టీడీపీ పార్టీ కి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ లోకి వెళ్ళబోతున్నారని, ఇప్పటికే తేదీ కూడా ఫిక్స్ అయ్యిందనే వార్తలు గత రెండు , మూడు రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వార్తల ఫై వంగవీటి రాధా స్పందించకపోయినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం క్లారిటీ ఇచ్చారు.

వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాధా యువసేన ఆ ప్రకటనలో తెలిపింది. రాధాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని.. రాధా ప్రతిష్టను మసకబార్చాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని.. రాధా టీడీపీలోనే కొనసాగుతారని పదేపదే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పదవుల కోసమో, ఇతర అవసరాల కోసం పార్టీలు మార్చే నైజం రాధాది కాదు అని పేర్కొన్నారు. కల్లా కపటాలు లేని స్వచ్ఛమైన రాజకీయాలు నడపటం రాధా నైజం అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్టను మంట కలపాలని చూసే వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవన్నారు. రాధాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వంగవీటి అభిమానులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక వంగవీటి రాధా రాజకీయం విషయానికి వస్తే.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో చాలా తక్కువ మెజార్టీతో ఓటమి ఎదురైంది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీచేయగా ఓడారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత టీడీపీ కి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.