మాండూస్ తుఫాన్‌ కారణంగా చిత్తూరులో స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన సర్కార్

మాండూస్ తుఫాన్‌ కారణంగా చిత్తూరు జిల్లాలో స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది సర్కార్ . ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మాండూస్ కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వచ్చే 6 గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనం పడనుందని ఐఎండీ వెల్లడించింది.

ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించగా, అధికారులకు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం.