జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌కు డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్

రేపు యధావిధిగా ఎన్నికలు

Division Bench Green Signal for ZPTC, MPTC Elections
Division Bench Green Signal for ZPTC, MPTC Elections

Amaravati: రాష్ట్రంలో జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌కు హైకోర్టు డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను కొట్టివేసింది.. దీంతో గురువారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది . ఈ ఎన్నిక‌ల‌పై టిడిపి హైకోర్టును ఆశ్ర‌యించింది.. దీనిని విచారించిన సింగిల్ బెంచ్ ఈ ఎన్నిక‌ల‌పై స్టే ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు నాలుగు వారాలు గ‌డువు ఉండాల‌ని సుప్రీం తీర్పుపై నే వాదన‌లు జ‌రిగాయి.. ఈ గ‌డువు గరిష్ట‌మే త‌ప్ప అన్ని రోజులే ఉండాల‌నేది సుప్రీం కోర్టు త‌న తీర్పులో పేర్కొన‌లేద‌ని ఎన్నిక‌ల సంఘం త‌రుపు న్యాయ‌వాది వాదించారు.. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న డివిజ‌న్ బెంచ్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/