ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా..? ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేశారు. రాంగోపాల్ అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?.. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?..ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సివుంది. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు!. డిక్లరేషన్ అడిగిన రామగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియోను జత చేసి చంద్రబాబు’’ ట్వీట్ చేశారు.
కాగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాంగోపాల్‌రెడ్డి గెలుపుపై అధికారులు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోవడంతో జాప్యం చేస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపైన టీడీపీ శ్రేణులు బైఠాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులు రాంగోపాల్‌రెడ్డి, పరిటాల సునీత, శ్రీరామ్, కాల్వ సహా పలువురిని అరెస్ట్ చేశారు.