మొత్తానికి పెళ్లి కూతురును పరిచయం చేసిన మంచు మనోజ్

మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డి ని ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడు. గత కొద్దీ రోజులుగా భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు..మార్చి 03 న వీరి వివాహం జరగబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ మంచు ఫ్యామిలీ మాత్రం ఈ పెళ్లి ఫై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో మరొకొన్ని గంటల్లో పెళ్లి తంతు మొదలుకాబోతున్న తరుణంలో మంచు మనోజ్ తన పెళ్లి అప్డేట్ ను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పెళ్లికూతురుగా తయారైన మౌనిక రెడ్డి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశారు. హైదరాబాద్‌‌లోని ఫిల్మ్‌ నగర్‌లో శుక్రవారం (మార్చి 3న) ఈ జంట వివాహబంధంతో ఒకటవ్వనున్నారు. కుటుంబ సభ్యులు రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మెహందీ ఫంక్షన్‌కి సంబంధించిన పిక్స్‌ని మనోజ్ సోదరి, నటి లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. మొదటి భార్యతో విడాకుల తర్వాత చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న మనోజ్‌కి పెళ్లి జరుగుతుండడంతో మంచు కుంటుంబం మొత్తం ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.