ఏపిలో గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

ap-global-investors-summit-2023

విశాఖః ఏపికి పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. GIS 2023 కు విశాఖపట్నం సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.45గంటలకు గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభమైంది. ఈ మేరకు సిఎం జగన్‌ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. సమ్మిట్‌కు హాజరైన కార్పొరేట్‌ దిగ్గజాలకు స్వాగతం పలికారు సీఎం జగన్‌. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి సాదర స్వాగతం పలికారు.

సమ్మిట్ పాల్గొనే భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలు.. వీరే..

జీఐఎస్ ప్రారంభ సెషన్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కీలక ప్రసంగాలు చేస్తారు. భారతదేశం నుంచి సమ్మిట్‌లో పాల్గొనే పారిశ్రామిక దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ KM బిర్లా, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, JSW గ్రూప్ సజ్జన్ చైర్మన్ జిందాల్, బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ , CEO సంజీవ్ బజాజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ పాల్గొననున్నారు.

30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు

జీఐఎస్ సమ్మిట్‌లో 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాల్గొననున్నారు. 25 దేశాలకు చెందిన 14వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.