పెళ్ళై మూడు నెలలు కాకముందే భార్య ను అమ్మేసిన భర్త

wedding
wedding

ఏ భర్త కూడా కట్టుకున్న భార్య ను మరొకరి చేతిలో పెట్టాడు. కష్టమైనా , సుఖమైనా తనతోనే కలిసి ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి పెళ్లి చేసుకొని మూడు నెలలలు గడవకముందే కట్టుకున్న భార్య ను లక్ష రూపాయలకు మరొకరికి అమ్మేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు మూడు నెలల క్రితం సురేకెలకు చెందిన రేవతితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఉపాధి కోసం భార్యను తీసుకుని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు. కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత సరోజ్‌రాణా తన భార్య రేవతిని ఓ కుటుంబానికి లక్షల రూపాయలకు అమ్మేసి ఒడిశా తిరిగి వచ్చేశాడు. రేవతి ఎక్కడా అని అత్తమామలు అడిగితే.. ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. అల్లుడి తీరుపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బాగోతం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ చేరుకుని రేవతిని రక్షించి తీసుకొచ్చి , సరోజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, భర్త తనను అమ్మేసిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని రేవతి చెప్పుకొచ్చింది.