వీర జవాన్‌ మ‌హేశ్‌కు క‌న్నీటి వీడ్కోలు

మహేశ్ పాడె మోసిన మంత్రి వేముల, ఎంపీ అర్వింద్

army-jawan-Mahesh-funeral

నిజామాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. మహేశ్‌ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన కోమన్‌పల్లిలో జరగనున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాలతో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఆయన గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర కొనసాగగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ ఆర్వింద్‌ ఆయన పాడె మోశారు. సమీప గ్రామాల ప్రజలు కూడా మహేశ్‌ అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ సీపీ కార్తికేయ పర్యవేక్షణలో 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్‌పల్లికి చేరుకున్నారు.

Army Jawan Mahesh Funeral is over in Nizamabad/manatelangana.news


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/