RTC బస్సులో మహిళ ఫై మూత్ర విసర్జన చేసిన యువకుడు

రీసెంట్ గా విమానంలో ఓ వ్యక్తి..మహిళ ఫై మూత్ర విసర్జన చేసి ఘటన అందర్నీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే తరహా లో మరో ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఈసారి బస్సు లో ఆ తరహా ఘటన చోటుచేసుకుంది. విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా వద్ద భోజనాలు చేసేందుకు ఆగింది. ఈ క్రమంలో బస్సులోని 28వ నంబరు సీటులో కూర్చున్న మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్న రామప్ప అనే 25 ఏళ్ల యువకుడు బస్సు ముందువరుసలో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు.

నిద్రలో ఉన్న ఆమె ఒక్కసారిగా లేచి కేకలు పెట్టింది. దీంతో బస్సులోని మిగతా ప్రయాణికులు, బస్సు దిగి టీ తాగుతున్న వారు పరుగున ఆమె వద్దకు వచ్చారు. నిందితుడిని పట్టుకుని చితకొట్టి బయటకు తోసేశారు. అతడి సామగ్రిని విసిరేశారు. కాగా, బాధిత మహిళ దాబాలోని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకుని వచ్చే వరకు బస్సును ఆపారు. నిందితుడైన యువకుడు మద్యం మత్తులో అలా చేశాడని భావిస్తున్నారు.