‘పెళ్లిసందD’ టీజర్ విడుదల

'పెళ్లిసందD' టీజర్ విడుదల

25 ఏళ్ల కిందట శ్రీకాంత్ – రాఘవేంద్ర రావు కలయికలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యిందో తెలియంది కాదు. కీరవాణి పాటలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాకు కు ఇప్పుడు మోడ్రన్ ‘పెళ్లి సందD’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ లోని పాటలు ఆకట్టుకోగా..మంగళవారం ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు చిత్ర యూనిట్.

టీజర్ లో.. రోషన్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా కనిపించగా. ఆ తర్వాత హీరోయిన్‌తో ప్రేమలో పడటం చూపించారు. ప్రకాష్ రాజ్‌తో రోషన్ ‘సహస్రకు పెళ్లి నాతోనా.. లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా ’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. పెళ్లి నేపథ్యంలోని ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. దర్శకేంద్రుడు గత చిత్రాల తరహాలోనే భారీ తారాగణంతో బ్యూటిఫుల్ విజువల్స్ తో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. సంగీత దర్శకుడు కీరవాణి ‘పెళ్లిసందడి’ పాటను ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ గా ఉపయోగించడం గమనార్హం.

‘పెళ్లి సందD’ చిత్రంలో ప్రకాశ్ రాజ్ – రాజేంద్రప్రసాద్ – రావు రమేష్ – తనికెళ్ళ భరణి – పోసాని కృష్ణ మురళి – హేమ – ప్రగతి – ఝాన్సీ – శ్రీనివాస్ రెడ్డి – షకలక శంకర్ – ఫిష్ వెంకట్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ – ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ లో తెలిపారు.