ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడుతూ..మృతి చెందిన యువకుడు

ప్రస్తుతం ఫోన్ లేకపోతే..బ్రతకడం కష్టంగా మారింది. లేచిన దగ్గరి నుండి నిద్రపోయేవరకు అంత కూడా ఫొనేతోనే గడుపుతున్నారు. ఇక ఇప్పుడే అదే ఫోన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. సెల్ ఫోన్ ఛార్జింగ్‌‌ పెట్టి మాట్లాడుతుండగా..ఒక్కసారిగా షాక్ రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. నెల్లూరు జిల్లా సీతారామపురం పరిధిలోని ముత్తోలి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ముత్తోలి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు మంగళవారం (సెప్టెంబర్ 6) సాయంత్రం తన సెల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి.. ఛార్జింగ్‌లో ఉండగానే ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చాయని.. ఈ కారణంగానే విద్యుత్ ప్రసారమై ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.యువకుడి మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.