ప్రతిపక్షాల సమావేశాన్నికి హాజరుకాబోము

Mamata Banerjee
Mamata Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జనవరి 13న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని ప్రకటించారు. తన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహంతో ఉన్న మమతా బెనర్జీ.. కేంద్ర కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో తాను ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం వెల్లడించారు. కాగా, కార్మికులపై కేసులు బనాయించడానికే మమతకు చెందిన టిఎంసి హింసాకాండను సృష్టించిందని సిపిఎం, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/