అన్నింటికీ ఎదురొడ్డి నిలిచాం: మమతా బెనర్జీ

మమతా గెలుపుపై సందిగ్ధత!

Mamata Benerjee
Mamata Benerjee

పశ్చిమ బెంగాల్ లో మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 200కి పైగా స్థానాలు దక్కనుండడంతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నీచ రాజకీయాలకు పాల్పడిన బీజేపీ ఓటమిపాలైందని అన్నారు. ఎన్నికల సంఘం రూపంలో తమకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, అన్నింటికి ఎదురొడ్డి నిలిచామని అన్నారు.  

ఇదిలా ఉంటే నందిగ్రామ్ లో మమతా బెనర్జీ గెలుపుపై సందిగ్ధత నెలకొంది. నందిగ్రామ్ బరిలో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ తరఫున సువేందు అధికారి పోటీ పడ్డారు. అయితే, సువేందుపై మమతా 1200 ఓట్ల మెజారిటీతో నెగ్గినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో నందిగ్రామ్ ఫలితంపై అనిశ్చితి ఏర్పడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/