మునుగోడు ఉప ఎన్నిక : నేడు కోమటి రెడ్డి రాజగోపాల్ నామినేషన్

మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలుకావడంతో నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికల సందడి మొదలైంది. ఎటు చూసిన..ఏం మాట్లాడిన ఎన్నిక గురించే..ఇప్పటికే అన్ని పార్టీల నేతలు మునుగోడు లో ప్రచారం చేస్తూ ప్రజల మద్దతు కోరుకుంటున్నారు.

మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు మునుగోడులోని తన క్యాంపు కార్యాలయం నుంచి 50 వేల మందితో భారీ ర్యాలీగా చండూరుకు చేరుకుని 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. రాజగోపాల్ వెంట పార్టీ నాయకులు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, వివేక్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బూపేందర్ యాదవ్ హాజరుకానున్నారు. మునుగోడు సీటు బీజేపీకే దక్కాలన్న లక్ష్యంతో బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న రాజగోపాల్‌రెడ్డి..కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాను 20వేల కాంట్రాక్టులకు లొంగిపోయానన్న మాట్లల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.