ఢిల్లీ హింసపై స్పందించిన మమతా బెనర్జీ

ఇది ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించిన మారణహోమం

Mamata Banerjee
Mamata Banerjee

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ఢిల్లీలో హింసపై స్పందించారు. హింసకు కారణం భారత జనతా పార్టీనే అని ఆరోపించారు. బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇది ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించిన మారణహోమం. అయినప్పటికీ బిజెపి ఇంకా క్షమాపణలు చెప్పడం లేదు. పైగా, ఇక్కడి వచ్చి మాకు బెంగాల్‌ కావాలని అంటున్నారు. కాబట్టి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చాలని మనమందరం ఈ రోజే ప్రతిజ్ఞ చేద్దాం. లేకపోతే ఇలాంటి అల్లర్లను ఆపలేముగ అని సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు మమత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే, షా ర్యాలీలో కొంతమంది బిజెపి కార్యకర్తలు ‘గోలీ మారో (కాల్పి చంపండి) అనే నినాదాలు చేశారు. దాంతో అమిత్ షా ఆరోపణలకు మమత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/