చంద్రబాబును అడ్డుకోవడంపై విచారణ వాయిదా
డిజిపి గౌతమ్ సవాంగ్ హాజరుకావాలన్న ఏపి హైకోర్టు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో టిడిపి నేత శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించి, పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు ఏ విధంగా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి స్పష్టం చేశారు. అనంతరం విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. డిజిపిని ఈ నెల 12న హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. అనుమతి ఇచ్చినందునే చంద్రబాబు ప్రజాచైతన్యయాత్రలో పాల్గొనేందుకు విశాఖ వచ్చారని, అలాంటప్పుడు ఆయన పర్యటనను నిలిపివేసి వెనక్కి ఎలా పంపుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/