త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతిః మల్లు రవి

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్న కాంగ్రెస్ నేత

mallu-ravi-says-vijayashanthi-will-join-congress-soon

హైదరాబాద్‌ః రాములమ్మ విజయశాంతి నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. ప్రస్తుతం విజయశాంతి బిజెపిలో ఉన్నారు. కొన్నిరోజులుగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి ఆమె పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆమె బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మల్లు రవి మాట్లాడుతూ… విజయశాంతి తమ పార్టీలో చేరుతున్నారన్నారు.