ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు..

Mallu Bhatti Vikramarka Telangana Assembly

హైదరాబాద్ః తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఓట్‌ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టారు. రూ. 2,75,891 కోట్ల‌తో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్
రెవెన్యూ వ్య‌యం రూ. 2,01,178 కోట్లు..మూల‌ధ‌న వ్యయం రూ. 29,669 కోట్లు.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం మాత్ర‌మే చేయ‌డం జ‌రిగింద‌న్నారు. హామీల‌కు సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించే ప‌ని ఇంకా కొన‌సాగుతున్నందున‌, అది పూర్త‌యిన వెంట‌నే అమ‌లుకు అవ‌స‌ర‌మైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్ర‌మార్క తెలిపారు.

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖ‌కు రూ. 774 కోట్లు కేటాయింపు
పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 40,080 కోట్లు
మూసీ న‌ది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు
పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,692 కోట్లు
వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 19,746 కోట్లు

ఎస్సీ గురుకులాల భ‌వ‌న నిర్మాణాల‌కు రూ. 1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భ‌వ‌న నిర్మాణాల‌కు రూ. 250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భ‌వ‌నాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు