మల్కాజ్ గిరి లో ఈటెల గెలుస్తాడంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

మరో మూడు వారాల్లో తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా అన్ని పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం..ఈ ఎన్నికల్లో గెలుపుతో పార్టీ భవిష్యత్ ఉంటుంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ తన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి బస్సు యాత్ర తో జనాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి , మేడ్చల్ మ్మెల్యే మల్లారెడ్డి…మల్కాజ్ గిరి లో ఈటెల గెలుస్తాడంటూ కామెంట్స్ చేసి బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపారు.

హైదరాబాద్ కొంపెల్లిలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఓ వేడుకకు ఈటల రాజేందర్‌ హాజరుకాగా.. అదే ఫంక్షన్‌కు మల్లారెడ్డి కూడా వెళ్లారు. అక్కడ ఈటల రాజేందర్‌ను చూసిన మల్లారెడ్డి.. ఈటలను ఆప్యాయంగా పలకరించారు. దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. ఈటలతో ఓ ఫొటో తీయాలంటూ కోరారు. మళ్లీ ఎప్పుడు కలుసుకుంటానో ఏమో అంటూ ఫోటో తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుందని ఈటల అడగటంతో.. మరో మాట చెప్పకుండా డైరెక్టుగా.. నువ్వే గెలుస్తావన్నా.. అంటూ ఎంతో ప్రేమగా చెప్పారు మల్లారెడ్డి. ఈ మాటతో అక్కడున్న వాళ్లందరి ముఖాల్లో నవ్వులు విరబూశాయి. తమ పార్టీ అభ్యర్ధే గెలుస్తాడని చెప్పకుండా బిజెపి నేత గెలుస్తాడని చెప్పడం ఏంటి అని అంత మల్లారెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి అయన ఏ సమాధానం చెపుతాడో చూడాలి.