విజయనగరం జిల్లాలో కరోనా కలకలం

ఏకలవ్య స్కూల్ లో 14 మందికి కరోనా

Corona virus in Vizianagaram district

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండడం తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ తరుణంలో విజయనగరం జిల్లా ఏకలవ్య పాఠశాలలో 14 మందికి కరోనా సోకడం పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది.

విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఐటిడిఏ పిఓ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత మరికొంతమందికి పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వీరిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. కాగా.. ఇండియా లో గత 24 గంటల్లో 11,692 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 66,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.