అనారోగ్యానికి గురైన KGF నటి

KGF ఫేమ్ మాళవిక అవినాష్‌ అనారోగ్యానికి గురైంది. కేజీఎఫ్‌ సినిమాలో కథను నడిపించే సీనియర్‌ ఉమెన్‌ జర్నలిస్ట్‌ పాత్రలో ఈమె నటించింది. శాండల్‌వుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న మాళవిక అవినాష్.. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా నటిస్తూ గుర్తింపు పొందారు. కేజీఎఫ్‌ సినిమా ద్వారా పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఈమె తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. ఈవిషయాన్ని ఆమెనే స్వయంగా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మాళవిక అవినాష్ గత కొన్నాళ్లుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా.. మాళవిక మొహం మొత్తం మారిపోయింది. ముఖం మందంగా ముద్దలా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉండగా తీసిన ఫొటోని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరికైనా మైగ్రేన్‌ సమస్య ఉంటే.. వారు దాన్ని తేలికగా తీసుకోవద్దని సూచించింది. లేదంటే తనలా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇక తాను మైగ్రేన్‌ సమస్య నుంచి బయటపడటం కోసం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాక మైగ్రేన్‌ సమస్య ఉన్న వారు.. డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా సూచించింది.