‘మేజర్’ ట్రైలర్ రిలీజ్..

మొదటి నుండి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు అడివి శేష్..తాజాగా మేజర్ మూవీ తో జూన్ 03 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.

కాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి నింపారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్.. మలయాళంలో హీరో పృథ్వీరాజ్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు.

‘బోర్డర్ దాటి పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ లోకి వెళ్లాడమేంటి?.. సందీప్ అది వాళ్ళది’ అని తన సుపీరియర్ ఆఫీసర్ అంటుంటడగా.. ‘అది కూడా మనదే కదా సార్’ అని అడివి శేష్ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సందీప్ బాల్యం నుంచి.. యుక్తవయస్సు నుంచే సైన్యంలో చేరాలనే అతని లక్ష్యం.. NSG కమాండర్ గా అందించిన సేవలు.. ముంబై టెర్రర్ అటాక్స్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించే విషాద సంఘటనల వరకు సోల్జర్ జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ‘మేజర్’ సినిమా స్పృశిస్తుంది. సందీప్ రోల్ లో శేష్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి.

మేజర్ తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్ , రేవతి అద్భుతమైన నటన కనబరచగా.. అతని ప్రేయసిగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కనిపించింది. అబ్బూరి రవి మాటలు అందించగా, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ ‘మేజర్’ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

YouTube video