అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది: ఆనంద్ మహీంద్రా

ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టర్ కోరుకుంటుంది..: ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ పథకంపై ప్రముఖ పారశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/