మహేష్ సరసన అందాల రాక్షసి..?

అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి కి సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో హ్యాట్రిక్ మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా..సెకండ్ హీరోయిన్ కోసం గాను పలువుర్ని అనుకున్న త్రివిక్రమ్ ఫైనల్ గా లావణ్య త్రిపాఠి ని ఓకే చేసినట్లు సమాచారం.

ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి షూరు కానున్న‌ది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. తాజా సినిమాతో ఏవిధంగా అలరిస్తారో వేచి చూడాలి. ఇక‌ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 01 న ప్రేక్షకుల ముందుకు రానుంది.