సూర్యప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి

తిరుమల: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రికి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. గురువారం ఉదయం సర్వభూపాల వాహనంపై స్వామివారి అభయం జరగనుంది. రేపు రాత్రి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. దీంతో శ్రీవారి వాహన సేవలు ముగుస్తాయి. శుక్రవారం తెల్లవారుజామున చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి జరగనున్న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/