కొత్త‌గా సోంత స్పేస్ స్టేష‌న్ నిర్మించుకోనున్న ర‌ష్యా

russia-to-build-its-own-space-station-to-quit-iss-after-2024

మాస్కోః అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (sis) నుండి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైంది. అయితే, 2024 తర్వాతే ఐఎస్‌ఎస్‌ నుండి బయటకు రానున్నట్లు వెల్లడించింది. ఇటీవ‌ల ర‌ష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మాస్ డీజీగా నియ‌మితుడైన యూరీ బోరిసోవ్ ఈ విష‌యాన్ని తెలిపారు. దీనికి సంబంధించి ర‌ష్యా మీడియా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు ర‌ష్యా గుడ్ బై చెప్పినా, ఆ దేశం మాత్రం అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు దూరం కావ‌డం లేద‌ని తెలిపింది. కొత్త‌గా స్వంత అంత‌రిక్ష కేంద్రాన్ని నిర్మించ‌నున్న‌ట్లు ర‌ష్యా స్ప‌ష్టం చేసింది. స్పేస్ స్టేష‌న్ అంశంలో త‌మ భాగ‌స్వాముల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్ కోసం నాసా, జాక్సా, ఈఎస్ఏ, కెన‌డా స్పేస్ ఏజెన్సీలు కలిసి ప‌నిచేయ‌నున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/