కేక పుట్టిస్తున్న మహేష్ న్యూ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా లుక్ కేక పుట్టిస్తుంది. నెటెడ్ టీ షర్టుతో పైకి దువ్వీ దువ్వనట్టుగా జట్టు ఉండగా.. అక్కడక్కడ తెల్ల జుట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా పల్చటి గడ్డం, షార్ప్ లుక్స్ తో డిఫరెంట్ గా కనబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మహేష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త లుక్ ను తాను ఇష్ట పడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. మహేష్ ఫొటోను చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

మహేష్ బాబు వయసు పెరుగుతున్నా కొద్ది యంగ్ గా కనిపిస్తున్నాడు. సినిమా సినిమా కు ఆయన యొక్క లుక్ మరింత స్టైలిష్ గా కనిపిస్తూ ఉంది. తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన లుక్ ఇది. మామూలుగా అయితే మహేష్ బాబు గడ్డం తో ఎక్కువగా నటించింది లేదు. ఆమధ్య మహర్షి లో కాస్త గడ్డం లుక్ లో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 28 లో గడ్డంతో కనిపించబోతున్నాడు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా కూడా మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ న్యూ లుక్ కు ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఇప్పటి నుంచి అభిమానులు ఎదురు చూడటం మొదలు పెట్టారు. మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబో సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.