కార్తికేయ దెబ్బకు మాచర్ల కలెక్షన్స్ డ్రాప్..

నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం నిన్న (ఆగస్టు 13 ) ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కార్తికేయ 2 కు సూపర్ హిట్ టాక్ రావడంతో మాచర్ల నియోజకవర్గం చిత్ర కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఈ సినిమాను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించగా ..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమైన ఈ చిత్రానికి మొదటి రోజే మిశ్రమ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే రాబట్టినప్పటికీ..రెండో రోజు భారీగా పడిపోయాయి. సినిమాకు డివైడ్ టాక్ రావడం..కార్తికేయ 2 రిలీజ్ అవ్వడం , హిట్ టాక్ తెచ్చుకోవడం తో మాచర్ల కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు మాచర్ల నియోజకవర్గం సినిమా 4.62 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోగా రెండవ రోజు మాత్రం అందులో సగం కూడా అందుకోలేకపోయింది.

ఈ సినిమా కేవలం 1.62 కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ముఖ్యంగా నితిన్ కు ఎంతో పట్టున్న నైజాం ఏరియాలో కూడా కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్న మాచర్ల నియోజకవర్గం ఓవర్సీస్ లో ఇతర రాష్ట్రాల్లో 70 లక్షల వారికీ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా శనివారం వరకు 6.69 కోట్లు మాత్రమే రాబట్టింది. రూ. 21.20 కోట్ల వరకు బిజినెస్ చేసిన మాచర్ల..రూ. 22 కోట్లు రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అంత రాబట్టడం కష్టమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.