మహేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే.. రికార్డులు గల్లంతే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు మహేష్. తన కెరీర్‌లో 28వ చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ ఓ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు కూడా సినిమా టైటిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న మూడో సినిమాకు కూడా అదిరిపోయే టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

ఈ క్రమంలో అతడు సినిమాలో పార్థు అనే పాత్రలో మహేష్ బాబు నటన సూపర్బ్‌గా ఉండటంతో, ఇప్పుడు అదే పేరును తమ కొత్త చిత్రానికి పెట్టాలని చూస్తున్నారట. ఒకవేళ మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోయే మూడో సినిమాకు నిజంగానే పార్థు అనే టైటిల్ పెడితే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. దీంతో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం కూడా ఖాయమని సినీ ప్రేమికులు అంటున్నారు.