మరో రీమేక్‌పై కన్నేసిన వెంకీ

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీమేక్ చిత్రాలతో సక్సె్స్ అందుకోవడంలో తనకు తానే సాటి అని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఎఫ్2కి సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు.

కాగా ఇప్పుడు వెంకీ చూపు మరో రీమేక్‌పై పడినట్లు తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని వెంకీ భావిస్తున్నాడట. గతంలోనే ఈ సినిమాను వెంకీ రీమేక్ చేస్తాడనే వార్తలు వినిపించినా, ఆ తరువాత ఈ సినిమాను మాస్ రాజా రవితేజ రీమేక్ చేస్తాడనే వార్త వినిపించింది. దీంతో ఈ సినిమా గురించి జనం మరిచిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ వెంకటేష్ ఈ సినిమాను రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి వెంకటేష్ మరో రీమేక్ చిత్రాన్ని లైన్‌లో పెట్టేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది. మరి నిజంగానే ఈ సినిమాను వెంకీ రీమేక్ చేస్తాడా లేక దఇది కూడా ఓ రూమర్ లాగే మిగిలిపోతుందా అనేది చూడాలి.