కృష్ణంరాజు మరణిస్తే చిత్రసీమ ఇచ్చే గౌరవం ఇదేనా..? – రామ్ గోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి చిత్రసీమను టార్గెట్ చేసారు. రెబెల్ స్టార్ కృష్ణం రాజు మరణిస్తే కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపలేరా..? అంటూ ప్రశ్నించారు. ఇదేనా ఓ పెద్దాయనకు మీరు ఇచ్చే గౌరవం అంటూ నిలదీశారు. చిత్రసీమ సమస్యల కోసం దాదాపు నెల రోజులు షూటింగ్ లు ఆపేసిన చిత్రసీమ.. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! అంటూ వర్మ సంచలన ట్వీట్ చేసారు.

మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. నేను కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, పవన్ కల్యాణ్ కు, మహేశ్ బాబుకు, బాలయ్యకు, ప్రభాస్ కు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే… రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది’ అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళికి కూడా ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా లో , చిత్రసీమలో వైరల్ గా మారాయి. దీనిపై ఎవరైనా స్పందిస్తారా..లేదా అనేది చూడాలి.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు నిన్న ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వస విడిచారు. ఈయన మరణం చిత్రసీమకు తీరని లోటుగా చెప్పాలి. ఈయన మరణ వార్త తెలిసి..కడసారి ఆయన్ను చూసేందుకు చిత్రసీమతో పాటు రాజకీయ ప్రముఖులు కదిలివచ్చారు.

ఈరోజు మధ్యాహ్నం మొయినాబాద్ లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద నుండి ఉదయం 11:30 గంటలకు పార్థివదేహం బయలుదేరుతుంది. నిన్నటి వరకు అందరూ కృష్ణం రాజుకు తలకొరివి పెట్టేది ప్రభాసే అనుకున్నారు. కానీ చివరి క్షణంలో.. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణం రాజు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. అలాగే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబదించిన ఏర్పాట్లు చేస్తున్నారు.