దీపికా పదుకొనేకు కరోనా పాజిటివ్

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా తనదైన మార్క్ వేసుకుని దూసుకుపోతుంది. కాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా దీపికా స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకుని వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకుంది దీపికా. కాగా గతనెల తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి బెంగుళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

అక్కడే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న దీపికాకు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల దీపికా తండ్రి ప్రకాష్ పదుకొనే ఆమె తల్లి ఉజ్జల, సోదరి అనీషాలకు కరోనా సోకింది. దీంతో దీపికా నేడు కరోనా పరీక్ష చేయించుకోగా, ఆమెకు పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపింది. తనకు కరోనా సోకిందని, తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని దీపికా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉండటంతో, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీపికాకు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉండటంతో ఆమె త్వరగా కరోనా నుండి కోలుకోవాలని పలువురు కోరుతున్నారు.