మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రికార్డు ఆయన ఖాతాలో వచ్చి చేరింది. మహేష్ బాబు సినిమాలు , యాడ్స్ తోనే కాదు సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 13 మిలియన్స్‌కి చేరుకుంది. దక్షిణాదిన ఓ హీరోకి ట్విట్టర్‌లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య పరంగా చూసుకుంటే ఇదే హైయెస్ట్. ఈ విషయాన్నీ తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం మహేష్ రెండు భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఒకటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.