ధమాకా డైెరెక్టర్ కు నిరసన సెగ

ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కు నిరసన సెగ ఎదురైంది. 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాతో డైరెక్టర్ గా పరిచమైన ఈయన..ఆ తర్వాత నేను లోకల్ , సినిమా చూపిస్తా మావ , హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన రవితేజ తో ధమాకా మూవీ ని చేసాడు. ఈ నెల 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర ప్రమోషన్ లలో బిజీ గా ఉన్న త్రినాథరావు నక్కిన కు నిరసన సెగ ఎదురైంది.

త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షేమపణలు తెలుపాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది. ధమాకా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ చిత్ర ద‌ర్శకుడు త్రినాథరావు నక్కిన త‌మ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచే విధంగా మాట్లాడార‌ని, ఇలాంటి వారిని స‌హించ‌బోమ‌ని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖ‌ర్ స‌గ‌ర వెల్లడించారు. బుధువారం హైద‌రాబాద్ ఫిలిం చాంబ‌ర్ వద్ద నాయ‌కులు ఆందోళ‌న చేపట్టి ..దిష్టి బొమ్మలను ద‌గ్ధం చేశారు. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సినిమాలు ఆడ‌కుండా ఆపేస్తామ‌ని తెలంగాణ సగర (ఉప్పర) సామాజిక‌వ‌ర్గం నాయ‌కులు వెల్లడించారు. బ‌హిరంగ క్షమాప‌ణ చెప్పకపోతే వ‌దిలిపెట్టే ప్రసక్తే లేద‌ని తేల్చి చెప్పారు.