45 మందితో కొలువుదీరనున్న మహారాష్ట్ర కొత్త మంత్రివర్గం!

25-ministers-from-bjp-13-from-team-shinde-in-maharashtra-cabinet

ముంబయిః మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, 45 మంది మంత్రులతో నూతన కేబినెట్‌ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తం 45 మందితో కొలువుదీరే మంత్రివ‌ర్గంలో బీజేపీ నుంచి 25 మంది మినిస్ట‌ర్లుగా ప్ర‌మాణం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన మ‌రో 13 మంది కూడా మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశ ఉంది. ఈ 45 మందిలో చాలా మంది కొత్త‌వారే ఉంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

శివ‌సేన‌కు చెందిన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ నాయ‌క‌త్వంతో జ‌త‌క‌ట్టి ఉద్ధవ్ థాక్రే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి.. అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌హారాష్ట్రలో బీజేపీ, శివ‌సేన సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ రాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/