శివసేన వర్గాలకు మహారాష్ట్ర స్పీకర్ నోటీసులు

Maharashtra Speaker issues notices to both Sena factions over disqualification

ముంబయిః మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్ నర్వేకర్‌ విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ‘మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్‌ ప్రశ్నించారు. తాను జారీచేసిన నోటీసులకు వివరణ ఇవ్వాలని రెండు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించారు.

గతంలో శివసేనను చీల్చి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్‌ థాకరే వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు ఇచ్చారు. అయితే, షిండే వర్గంలోని 40 మందిలో 16 మంది అనర్హత విచారణ ప్రారంభించినున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పీకర్‌కు సమాచారం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో స్పీకర్‌ నర్వేకర్‌ వెంటనే శివసేన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు ఇష్యూ చేశారు. ప్రస్తుతం అసలైన శివసేన తమదంటే తమదేనని రెండు వర్గాల ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఉద్ధవ్‌ థాకరే వర్గం పిటిషన్‌తో ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడంతో సీఎం షిండే సహా ఆయన వర్గంలో 16 మంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారించాలని ఈసీని ఆదేశించింది. ఏక్‌నాత్‌ షిండే సీఎం పదవిలో కొనసాగవచ్చని పేర్కొంది.