‘ మహా సముద్రం ‘ ట్రైలర్ టాక్..మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా?

శర్వానంద్ – బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ”మహాసముద్రం”. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్.. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

‘సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది’ అని శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్నీ నదులు కోరుకుంటాయ్’ అని అదితి తన అమాయకపు స్వభావాన్ని వెల్లడించింది. ఇందులో శర్వానంద్ తన గెటప్ తో పాటుగా క్యారెక్టర్ లో కూడా వైవిధ్యం చూపించాడు. ఇక సిద్ధార్థ్ పాత్రకు కూడా ఈక్వల్ ఇంపార్టన్స్ ఇచ్చారు. “మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ అని సిద్ధార్థ్ చెప్పడంలో పరిస్థితులకు అనుగుణంగా అతను కూడా తప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. శర్వా – అను ఇమ్మాన్యుయేల్ మధ్య లిప్ లాక్ సీన్ ఉండగా.. అదితి రావు హైదరి కూడా బోల్డ్ రోల్ లో కనిపిస్తుంది. అయితే ఇందులో ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారనే విషయాన్ని తెలియకుండా ట్రైలర్ ను కట్ చేసి డైరెక్టర్ సినిమా ఫై ఆసక్తి పెంచారు. మీరు కూడా ట్రైలర్ ఫై ఓ లుక్ వెయ్యండి.

YouTube video