దేశంలో కొత్తగా 34,113 కరోనా కేసులు
మొత్తం మరణాల సంఖ్య 5,09,011

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో 34,113 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 91,930 మంది కోలుకున్నారని వివరించింది. కరోనా వల్ల నిన్న 346 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 4,78,882 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 4,16,77,641 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 5,09,011కు పెరిగింది. మొత్తం 172,95,87,490 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/