అక్రమ మద్యం ఫై జగన్ ఉక్కుపాదం

cm jagan

గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దీన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భాంగా జగన్ మాట్లాడుతూ..మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచాం..మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశాం. బెల్టుషాపులను తీసేశాం, పర్మిట్‌రూమ్‌లను మూసివేయించాం, లిక్కర్‌సేల్స్‌ నెలకు 34 లక్షల కేసులనుంచి 21 లక్షల కేసులకు తగ్గాయి, బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయి. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే ..డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

  • ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలి.
  • కార్యాచరణ తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.
  • ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి.
  • ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన దృష్టిపెట్టాలి అని అన్నారు.