మహీంద్రా- మహీంద్రా సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ విడుదల

Mahindra Bolero MaXX Pik-Up Range Launched Priced at Rs 7.85 lakh

భారతదేశపు పికప్‌ విభాగానికి మహీంద్రా కుదుపును కలిగించింది.
సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ పిక్‌–అప్‌ శ్రేణి; … రూ.7.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది
సరికొత్త బోలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ పిక్‌–అప్‌ శ్రేణి వినూత్నమైన ఫీచర్లు పనితీరును అజేయమైన విలువతో అందించేలా రూపొందింది. భారీగా మైలేజ్, సామర్ధ్యం, సౌలభ్యం, భద్రతలతో ఉత్పాదకతలను అందించడం ద్వారా పెద్ద మొత్తంలో లాభదాయకతకు దారి చూపుతుంది.వినియోగదారుల పట్ల మహీంద్రా నిబద్ధతను మరింత నిరూపించేలా దరలో మార్పు లేకుండానే అత్యాధునిక ఫీచర్‌లతో సరికొత్త వాహన శ్రేణి బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ పిక్‌–అప్‌.

–ౖ ఈ విభాగానికి సంబంధించి పరిశ్రమలోనే మొదటి సారిగా.. ఆకట్టుకునే 3050 ఎంఎం కార్గో బెడ్‌తో సహా 1.3టి నుంచి 2టి వరకు పేలోడ్‌ సామర్థ్యాలు,
–భారీ లోడ్‌లను సులభంగా హ్యాండిల్‌ చేయగలిగేలా అధిక శక్తి టార్క్‌తో కూడిన కొత్త ఎం2డిఇ ఇంజన్,.
ౖ –ఎంఎఎక్స్‌ఎక్స్‌ కనెక్ట్‌ చేయబడిన సొల్యూషన్‌ ద్వారా అనుసంధానించిన శక్తివంతమైన ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ దీని స్వంతం. ఇది ఆరు భాషల్లో యాక్సెస్‌ చేయగల మొబైల్‌ యాప్‌లో 50కి పైగా ఫీచర్లతో వాహనం ట్రాకింగ్, రూట్‌ ప్లానింగ్, ఖర్చు నిర్వహణ, జియో–ఫెన్సింగ్, వాహనపు కండిషన్‌ పర్యవేక్షణ కోసం కీలకమైన మార్గదర్శకాలను అందిస్తూంది
–ౖ రెండు సిరీస్‌లలో అందుబాటులో ఉంది – హెచ్‌డి సిరీస్‌ (హెచ్‌డి 2.0ఎల్, 1.7ఎల్‌ 1.7, 1.3) సిటీ సిరీస్‌ (సిటీ 1.3, 1.4, 1.5, సిటీ సిఎన్‌జి)

హైదరాబాద్: భారతదేశంలో నెం.1 పికప్‌ బ్రాండ్‌ అయిన బొలెరో పిక్‌–అప్‌ తయారీదారులైన మహీంద్రా – మహీంద్రా (ఎం అండ్‌ ఎం), తన పూర్తిగా సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణిని నేడు విడుదల చేసింది.రూ.. «7.85 లక్షల (ఎక్స్‌–షోరూమ్‌) దరతో ప్రారంభమై పూర్తి గా సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణి శక్తివంతమైన ఫీచర్‌లు ,పనితీరును అందించేలా కస్టమర్‌లు, ఆపరేటర్‌లకు సాటిలేని విలువ ఆధారిత ప్రయోజనాల్ని కలిగిస్తుంది..

తేలికైన, మరింత ధృఢంగా,బహుళ ప్రయోజనాల.. పూర్తిగా సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణి పేలోడ్‌ సామర్థ్యం, ఇంధన సామర్థ్యం, భద్రత మొత్తం డ్రైవింగ్‌ అనుభవాలకు సంబంధించి కొత్త మైలురాళ్లను సృష్టిస్తుంది. ఇది మునుపెన్నడూ లేనంత ఎక్కువ విలువను అందించడానికి స్మార్ట్‌ ఇంజనీరింగ్‌ను కూడా మేళవించింది.

కొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణిని కనీసం రూ.24,999 డౌన్‌ పేమెంట్‌తో బుక్‌ చేసుకోవచ్చు, అడ్డంకులు లేని కొనుగోలు, యాజమాన్య అనుభవం కోసం ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌ పథకాలను కూడా మహీంద్రా అందిస్తోంది.

బొలెరో డిఎన్‌ఎకు పర్యాయపదంగా ఉండే ప్రధాన విలువలు, బలాలైన పటిష్టత, థృఢత్వం, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక పునఃవిక్రయ విలువలతో పాటుగా పూర్తి గా సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణి ఒక పూర్తి సరికొత్త ప్లాట్‌ఫార్మ్‌తో గేమ్‌ ఛేంజర్‌గా ఉంటుందని మహీంద్రా వాగ్దానం చేస్తుంది, ఇది దేశవ్యాప్తంగా పట్టణ రహదారులు, జాతీయ రహదారులపై ఆధిపత్యం చెలాయించే బొలెరోకు చెందిన మినిమలిస్ట్, కాలాలకు అతీతమైన డిజైన్‌ లాంగ్వేజ్‌ను కూడా అందిస్తుంది.

ఎమ్‌ అండ్‌ ఎమ్‌ ఆటోమోటివ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ వీజయ్‌ నక్రా మాట్లాడుతూ, ‘‘భారతదేశ ఆర్ధికవృద్ధికి మేక్‌ ఇన్‌ ఇండియా’’ స్ఫూర్తికి థృఢంగా కట్టుబడి ఉన్న కంపెనీగా మహీంద్రా ద్వారా, కస్టమర్‌ కేంద్రంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడం పట్ల మేం గర్విస్తున్నాము. మేము మా కస్టమర్‌లకు వృద్ధి, శ్రేయస్సును అందించే బహుళ ప్రయోజనకర వాహనాలను అందించడం ద్వారా వారి జీవితాలను సుసంపన్నం చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణి అత్యాధునిక ఫీచర్లు, సాటిలేని శక్తి, గరిష్ట పేలోడ్‌ సామర్థ్యాలు ఇంకా అధిక మైలేజీని కూడా అందిస్తుంది, ప్రతి ప్రయాణం డ్రైవర్‌లకు ఉత్పాదకంగా, అలసట లేకుండా ఉంటుందని వాగ్దానం చేస్తుంది. ఇది నిజంగా గరిష్ట ప్రయోజనం కోసం చూస్తున్న ఎవరికైనా ఒక గొప్ప విలువైన ఎంపికగా నిలుస్తుంది. ఈ ఉత్పత్తి శ్రేణితో కస్టమర్‌లకు అసమానమైన విలువను అందించడంలో, పిక్‌–అప్‌ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో మహీంద్రా తిరుగులేని నిబద్ధతను ప్రదర్శిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాము’’ అని చెప్పారు.

ఎమ్‌ అండ్‌ ఎమ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ అండ్‌ ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ వేలుసామి మాట్లాడుతూ, ‘మా సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణిని పరిచయం చేయడంతో, మేము పికప్‌ విభాగంలో ఆవిష్కరణలను అత్యుత్తమ స్థాయికి పెంచాము. డ్రైవింగ్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉత్పాదకతను పెంచడానికి ప్రతి ఫీచర్‌ నిశితంగా రూపొందించబడిందని నిర్ధారించుకొనే విధంగా కృషి చేస్తున్నాం. సాంకేతికంగా అభివృద్ధి చెందిన , అత్యంత బహుముఖ ప్రయోజనాలు కలిగిన పిక్‌ అప్‌ శ్రేణిని అందిస్తున్నాం అది కూడా సాటిలేని విలువతో. మహీంద్రాలో మా కస్టమర్ల విభిన్న అవసరాలను తీర్చేలా వారి వ్యాపారాలను ముందుకు నడిపించడంలో వారికి సహాయపడే ఉత్తమ తరగతి వాహనాలు నిరంతరం అందజేస్తున్నాం.

మహీంద్రా బ్రాండ్‌ మొదటిసారి ప్రారంభించినప్పటి నుండి రెండు మిలియన్లకు పైగా పిక్‌–అప్‌ యూనిట్లను విక్రయించింది. భారతదేశం కోసం భారతదేశంలో రూపొందించబడిన నిర్మించబడిన దాని వాహనాల శ్రేణి, దేశపు లాజిస్టిక్స్‌ అవసరాలకు ప్రత్యేకంగా సరిపోతుంది, తుదివరకూ ఇది దేశపు లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌కు వెన్నెముకగా అమరిపోతుంది.

పూర్తి సరికొత్త బొలెరో ఎంఎఎక్స్‌ఎక్స్‌ శ్రేణి రెండు సిరీస్‌లలో వస్తుంది – హెచ్‌డి సిరీస్‌ (హెచ్‌డి 2.0ఎల్, 1.7ఎల్‌ 1.7, 1.3) సిటీ సిరీస్‌ (సిటీ 1.3, 1.4, 1.5, సిటీ సిఎన్‌జి). కస్టమర్‌లకు అధిక సేవలను అందించడానికి రూపొందించబడింది. కార్యాచరణ, సంపాదన సామర్ధ్యం అలాగే అడ్డంకుల్లేని సంతోషకరమైన రహదారి ప్రయాణ అనుభవం. అదనంగా.. కొత్త శ్రేణి అధిక పేలోడ్‌ సామర్థ్యం, మెరుగైన మైలేజ్‌ , పనితీరు, మెరుగైన సౌకర్యం భద్రత అత్యంత విశ్వసనీయ, సమర్థవంతమైన రవాణా పరిష్కారాన్ని అందిస్తుంది.
ధరల వివరాలు (ఎక్స్‌ షోరూమ్‌) దిగువన

CITY Range HD Range
CITY 1.3 LX CBC Rs 7.85 Lakh HD 1.7 LX CBC RS 9.26 Lakh
CITY 1.3 LX Rs 7.95 lakh HD 1.7 LX Rs 9.53 Lakh

CITY 1.4 LX CBC Rs 8.22 Lakh HD 1.7L LX Rs 9.83 Lakh
CITY 1.4 LX Rs 8.34 Lakh HD 2.0L LX CBC Rs 9.99 Lakh
CITY 1.5 LX CBC Rs 8.22 Lakh HD 2.0L LX Rs 10.33 Lakh
CITY 1.5 LX Rs 8.34 Lakh
CITY CNG Rs 8.25 Lakh
–ఎల్‌ఎక్స్‌ వేరియంట్‌ కన్నా విఎక్స్‌ఐ వేరియంట్‌ రూ..25000 నుంచి రూ.30000 దాకా అధికం
–వైట్‌ కలర్‌ కన్నా గోల్డ్‌కలర్‌ రూ.5000 అధికం.