మహిళల కోసం ప్రత్యేక వైన్‌ షాపులు

మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ ప్రభుత్వం నిర్ణయం

wine shop
wine shop

లక్నో: మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా వైన్ షాపులు పెట్టాలని నిర్ణయించింది. తొలిదశలో భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లో మహిళలకు ప్రత్యేక వైన్ షాపులు పెట్టాలని భావిస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఫారెన్ లిక్కర్ మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటుంది. వైన్ షాపుల్లో కేవలం విస్కీ, వైన్ మాత్రమే ఉంటాయి. బీర్లు, చీప్ లిక్కర్ ఉండదు. అది కూడా ఫారెన్ బ్రాండ్స్ మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో తయారు చేసే మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లో వైన్ ఫెస్టివల్స్ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ద్రాక్షపళ్లతో రాష్ట్రంలో తయారు చేసే మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు 15 టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు తెరవనున్నారు. మధ్యప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఆ రోజు నుంచి మద్యం ధరలు సుమారు 15 శాతం మేర పెరగనున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/