మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 26కు వాయిదా
కమల్ నాథ్ ప్రభుత్వానికి ఊరట

భోపాల్: సంక్షోభంలో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి మరింత గడువు లభించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన మరుక్షణం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాస్తవానికి సంక్షోభంలో ఉన్న కమల్ నాథ్ సర్కారు విశ్వాసం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఈ రోజు విశ్వాస పరీక్ష జరుగుతుం దనుకున్నా స్పీకర్ ఆ అంశం చేర్చలేదు. ఈ కారణంగానో ఏమో గవర్నర్ ఉమ్మడి సభల సమావేశంలో కేవలం ఒక్క నిమిషమే మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగ సంప్రదాయాలను, చట్టాలను పాటించాలని, ప్రజాస్వామ్య, శాసన సభ మర్యాదలను పాటించాలని సూచించి ప్రసంగం ముగించారు. తర్వాత స్పీకర్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై అధికార, విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/