మాచర్ల నియోజకవర్గం నుండి మాస్ సాంగ్ రిలీజ్ ..

మాచర్ల నియోజకవర్గం నుండి మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో నితిన్..తాజాగా “మాచర్ల నియోజకవర్గం” అనే మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమవుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా ప్రమోషన్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే పలు స్టిల్స్ , టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ ..శనివారం సినిమాలోని మాచర్ల సెంటర్లో..రారా రెడ్డి ఐ యామ్ రెడీ.. అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ ని శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆకాల వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కు మార్చారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. లిప్సిక ఆలపించారు. ఇటీవల విడుదల చేసిన సాంగ్ ప్రోమో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటకు జానీ మాస్టర్ తనదైన సిగ్నేచర్ స్టెప్స్ అంజలి తన గ్లామర్ తో రచ్చ చేస్తే .. నితిన్ ఎనర్జీ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. గతంలో కంటే ఈ సాంగ్ లో అంజలి మరింత గ్లామర్ గా కనిపించి మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ఇక సాంగ్ చివర్లో రాను రానుంటేనే చిన్నదో.. అంటూ జయం మూవీలోని బిట్ ని జరచేర్చి నితిన్ ఫ్యాన్స్ కు మరింత జోష్ ని అందించే ప్రయత్నం చేశారు.

పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా… ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో సంయుక్తంగా శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

YouTube video