నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

తొలి ఏకాదశి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ప్రస్తుతం విజయవాడలో ‘జనవాణి-జనసేన’ రెండో‌ విడత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్జీలను తీసుకొనున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రజల నుంచి అర్జీలను పవన్​ స్వీకరిస్తున్నారు. పాలకులు హామీలను ఇవ్వడమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి సమస్యలు పరిష్కంచాలన్న ఉద్దేశంతోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిచామని స్పష్టం చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో గత ఆదివారం ఆయన జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలపై ఆరా తీశారు.