లగ్జరీ కారును కొనుగోలు చేసిన మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేసారు. రీసెంట్ గా వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి..ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ .,.చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది.

ఇదిలా ఉంటె చిరంజీవి గ్యారేజీలో మరో అత్యాధునిక లగ్జరీ వాహనం చేరింది. టొయోటా వెల్‌ఫైర్‌ కారును చిరంజీవి కొనుగోలు చేసారు. దీని షోరూం ధర, లైఫ్‌ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయల విలువ ఉంటుందని సమాచారం. బర్నింగ్‌ బ్లాక్‌తో కనులవిందుగా దర్శనమిస్తున్న ఈ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70లక్షలతో టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను మెగాస్టార్‌ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)కోసం మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్‌ వచ్చారు. ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ చేసారు.

ఇక ఈ కారు ప్రత్యేకలు చూస్తే.. . హైస్పెసిఫికేషన్స్‌తో విడుదలైన ఈ మల్టీపర్పస్‌ వెహికిల్‌లో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. మధ్య వరుసలో వీఐపీ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉండటం విశేషం. ట్విన్‌ సన్‌రూఫ్‌, త్రీజోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్స్‌ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో కూడా పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్‌లో ఆటో, యాపిల్‌ కార్‌ప్లే సపోర్ట్‌ చేస్తాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ ఉన్నాయి. ఈ వాహనం మైలేజీ గరిష్ఠంగా లీటర్‌కు సుమారు 16.35 కిలో మీటర్లు. వీటితో పాటు పనోరమిక్‌ వ్యూ మానిటర్‌, వెహికిల్‌ డైనమిక్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్రంట్‌ అండ్‌ రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్స్‌ ఉండటం మరో విశేషం. దీనికి 2.5 పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు కూడా ఉన్నాయి.